కళాసీల డిమాండ్‌కు బోటు యాజమానుల కొత్త ఎత్తు
డీజిల్ సబ్సిడీ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి
సీఎంను కలిసేందుకు ఎమ్మెల్యే వాసుపల్లితో చర్చలు
వేటకు విరామం మరి కొన్నాళ్లు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా:
మత్స్యకారులకు-చేపల బోట్ల యజమా నుల మధ్య వివాదం రాజుకుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఈ నెల 15 నుంచి వేటకు వెళ్లాల్సిన బోట్లు అందుకు సిద్దం కావడం లేదు. వేటకు బయల్దేరడానికి సమయం ముంచుకొస్తున్న కొద్దీ వీరిద్దరి మధ్య వివాదాలు మరింతగా ముసురు కుంటున్నాయి. డీజిల్ ధరలు భారీగా పెరగడంతో తమకు ఏమీ మిగలడం లేదంటూ బోటు యజమానులు కళాసీల వాటాపై కన్నేశారు. తమ వాటాల్లో యజ మానులు వాటా అడగడాన్ని కళాశీలు తట్టుకోలేకపోతున్నారు. అనేక ఏళ్లుగా బోటుపై ఎండబెట్టుకుంటున్న ఎండు చేపలను కళాసీలే అమ్ముకుంటున్నారు. కానీ ఇప్పుడీ ఎండు చేపలపై బోటు యజ మానులు దృష్టి పెట్టారు. పైగా అందులో వాటా కావాలంటూ మెలిక పెట్టారు. ఎండు చేపలు వాటా తమకు అప్పగించకపోతే ఊరుకునేది లేదంటూ బోటు యజమాను లు తేల్చి చెప్పడంతో ఇప్పుడు ఆ బోట్లలో పని చేసే కళాసీలు అగ్గిమీద గుగ్గిలమవు తున్నారు. గతంలో వేటాడి వచ్చిన తర్వాత అమ్ముకున్న మొత్తంలోంచి 20 శాతం వేటగాళ్లకు, కళాసీలకు యజమానులు ఇచ్చేవారు. ఇప్పుడీ మొత్తాన్ని కూడా 30 శాతం పెంచాలని మత్స్య కార్మికులు పట్టుబడు తున్నారు. దానికి తోడు పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా వేటకెళ్లే కళాసీలు, వేటగాళ్లకు రేషన్‌ను అధికంగా పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో ఎండు చేపల్లో వాటాను బోటు
మొత్తంలోంచి 20 శాతం వేటగాళ్లకు, కళాసీలకు యజమానులు ఇచ్చేవారు. ఇప్పుడీ మొత్తాన్ని కూడా 30 శాతం పెంచాలని మత్స్య కార్మికులు పట్టుబడుతున్నారు. దానికి తోడు పెరిగిన ఖర్చులకు తగ్గట్టుగా వేటకెళ్లే కళాసీలు, వేటగాళ్లకు రేషన్‌ను అధికంగా పెంచాలని డిమాండ్ చేస్తుండడంతో ఎండు చేపల్లో వాటాను బోటు యజమానులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేపల వేట అటకెక్కింది. కళాసీలకు , బోటు యజమానుల మధ్య చర్చలు జరుగుతున్నా ఫలితం లేపోవడంతో ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ గందరగోళంగా ఉంది. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బోట్లు మాత్రం వేటకు కదిలే ప్రసక్తే లేదని మత్స్యకార్మికులు అంటున్నారు. వేటపై వివాదం ముదురుపాకాన పడుతుండడంతో అటు కార్మికుల్లోనూ, ఇటు బోటు యజమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. హార్బర్లో పరిస్థితి ఇలా ఉంటే బోటు యజమానుల సంఘం మరో సరికొత్త వివాదాన్ని ప్రభుత్వం ముందుంచుతోంది.మత్స్యకారులు వేటకు వెళ్లే బోట్ల కోసం డీజిల్ లీటర్‌కు రూ. 5 సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 10 కి పెంచాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మత్స్యకార సంఘాల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఈ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు వస్తున్న సందర్భంగా అప్పుడు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి డీజిల్ సబ్సిడీని పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకు చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 15 నుంచి వేటకు వెళ్లాల్సి ఉంది. కానీ వేటకు మరిన్ని రోజులు దూరంగా ఉంటే ఈ లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావొచ్చని, అప్పటికే కళాసీలు కూడా దారికి వస్తారని మత్స్యకార నేతలు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా అటు ప్రభుత్వం నుంచి డీజిల్ రాయితీ, మరో పక్క కళాసీల నుంచి ఎండు చేపల వాటా పొందవచ్చని మత్స్యకార నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకూ నిర్వహించాల్సిన చేపల వేట విరామాన్ని మరో నెల రోజులు అధికంగా పెంచేందుకు మత్స్యకార సంఘాల నేతలు ప్రణాళికలు రూపొందించారు. &ప్రస్తుతం జూలై 1వ తేదీ నుంచి వేటకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈలోగా ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని పెంచకపోతే మరో 15 రోజుల పాటు అదనంగా వేటకు విరామం ఇవ్వాలని తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. విశాఖ మత్స్యకార సంఘాల నేతలకు సంఘీభావంగా కాకినాడ, ఉప్పాడ, మచిలీపట్నం, నెల్లూరు, పూడిమడక, వాడ చీపురుపల్లి, భావనపాడు, శ్రీకాకుళం, కళింగపట్నం, ఎద్దలపాడు, భీమిలి వంటి ప్రాంతాల నుంచి కూడా వేటకు వెళ్లకూడదని మత్స్యకారులు నిర్ణయించినట్టు ఆ సంఘ నేతలు ‘ఫీచర్స్ ఇండియా’ ప్రతినిధికి చెప్పారు.