పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి అబ్బా.. లేకపోతే నవ్వులపాలవుతాం.. బి.కామ్ లో ఫిజిక్స్, వెంకన్న చౌదరి కాదేది నవ్వుకనర్హం అని ఇప్పటికే కొందరు తెలుగు పొలిటీషియన్స్ ప్రూవ్ చేసారు.. అలాంటి వాటిల్లో కొన్ని పవన్ జోకులు కూడా ఉన్నాయి.. బల్బ్ ని కనిపెట్టింది ఐన్ స్టీన్ అని, అసెంబ్లీలో ఎంపీలు ఉంటారని ఇలా పవన్ అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతూనే ఉన్నారు.. తాజాగా అలాంటిదే ఏడవ తరగతి జోక్ ఒకటి వేశారు పవన్.
రీసెంట్ గా పవన్ ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యానని అన్నారు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మరోవైపు ఈ వీడియో మీద సోషల్ మీడియాలో ఛలోక్తులు బాగా వినిపిస్తున్నాయి.. ఏడవ తరగతి అంటే ఇంచు మించు ఏడ్చే వయస్సు, ఆ వయస్సులో రాజకీయాల్లోకి రావాలని ఏం తెలుస్తుంది అని కొందరంటే.. ఏడవ తరగతిలో రాజకీయాల్లోకి రావాలనుకున్నావా? ఇంకానయం గర్భంలో ఏడవ నెలలో ఉండగానే డిసైడ్ అయ్యానని చెప్పలేదు అంటూ కొందరు వెటకారం చేస్తున్నారు.. మరికొందరైతే పవన్ ఏడవ తరగతి చదివే టైంకి ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టి ఉండరు.. కానీ పవన్ ఆ వయస్సులోనే డిసైడ్ అయ్యారట!! వాట్ ఏ జోక్ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.. అయితే ఈ వీడియోపై కొందరి స్పందన వేరేలా ఉంది.. కొందరు పిల్లలు మూడు నాలుగేళ్లకే అన్ని రాజధానులు, సీఎంల పేర్లు చెప్తారు.. అలానే పవన్ కి చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి రావాలనిపించిందేమో అంటున్నారు.