మంత్రి గంటా శ్రీనివాసరావు……………..
అడ్వంచర్ స్పోర్ట్స్‌కు ప్రోత్సాహకం…………..
పర్యాటక రంగం అభివృద్దికి కీలకం…………..
బీచ్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటుకు శ్రీకారం…………..
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: విశాఖ బీచ్‌లో భీమిలి బీచ్‌లను రూ.260 కోట్లతో ఆభివృద్ది చేయడానికి ప్రతిపా దించినట్లు రాష్ట్రమానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కోన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆర్.కె.బీచ్‌లో గురువారం బీచ్ వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ఏడాదికి ఆ ఏడాది పర్యాటకుల సంఖ్య విశాఖకు పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ధీంతో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని ఈ సంవత్సరం టూరిజం అండ్ డిజిటల్ ట్రాన్స్ఫార్మాషన్ ధీంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో అడ్వంచర్ స్పోర్ట్స్ ప్రోత్సహించనున్నట్లు పేర్కో న్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి విశాఖనగరం కీలకమైనదిగా భావిం చారు. విశాఖపట్నం రూరల్ టూరిజం, ట్రైబల్ టూరిజం, బుద్దిస్ట్ సర్క్యూట్, బీచ్ టూరిజంల అభివృద్దికి అనువైనదిగా వెల్లడించారు. స్మార్ట్‌సిటీ -సిటీ ఆప్ డెస్టినీగా విశాఖ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించినట్లు వివరించారు. కార్యక్రమానికి జిల్లాకలెక్టర్ ప్రవీణ్‌కుమార్, వి.యం.ఆర్ డి.ఏ కమిషనర్ బసంత్‌కుమార్, జివియంసి కమిషనర్ హరినారాయణన్, టూరిజం ఆర్.డి రాధాక్రిష్ణమూర్తి, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ డి.వి.రమణమూర్తి, సి.యం.ఓ.హెచ్ డా.హేమంత్, జిల్లా పర్యటక అధికారిణి పూర్ణిమాదేవి, వివిధ సంస్దల ప్రతినిధులు, హోటల్స్ యజమానులు, టూర్ ఆపరేటర్స్ తదితరులు హాజరైనారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్.కె.బీచ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గురువారం పర్యాటక దినం సందర్భంగా అన్ని పర్యాటక ప్రదేశాలలో ఉచిత ప్రవేశం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.