అమెరికాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం…….
అంకరేజ్ సఫారి సందర్శనకు వెళ్తుండగా ఘోర దుర్ఘటన………
ప్రమాదంలో మరో ముగ్గురి మృతి………..
కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన ఎంవీవీఎస్……….
విశాఖపట్టణం, ఫీచర్స్ ఇండియా : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యా హ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శిం చేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి మతి చెందగా కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడ్డారు.
వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగ నున్న గీతం సంస్థ పూర్వవిద్యార్థుల సమావేశంలో ప్రసంగించేందుకు ఆయన అమెరికా వెళ్లినట్లు తెలిసింది. ఇక్కడే లాస్ ఏంజెల్స్ నుంచి అలస్కాకు ఒక వ్యాన్ వంటి వాహనంలో వీరు బయలుదేరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తితో పాటు మతిచెందిన వారు బసవ పున్నయ్య వెలువోలు,ప్రసాద్ వీరమాచినేని,వెంకటరత్నం కడియాల, చిన్నాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఎన్ఆర్ఐ లు.. వీరంతా వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు అలస్కా వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.
నందమూరి కుటుంబానికి…మరో నష్టం
‘గీతం’ యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మరణం టీడీపీకే కాదు వ్యక్తిగతం గాను చంద్రబాబు కుటుంబానికి నష్టమే…అదెలాగంటే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకష్ణ…రెండో కుమార్తెను ఎంవీవీఎస్ మూర్తి మనమడికి ఇచ్చి పెళ్లి చేశారు…అంటే బాలయ్య వియ్యంకుడి తండ్రే ఈయన. ఇంకా చెప్పా లంటే నారా లోకేష్‌కు స్వయానా తోడల్లుడే ఈ ఎంవివిఎస్ మూర్తి మనమడు భరత్…ఆ విధంగా ఇటీవలే హరికష్ణను రోడ్డుప్రమాదంలో కోల్పోయిన నందమూరి కుటుంబానికి, చంద్రబాబుకు, టిడిపి ఇది మరో దురదష్టం. మూర్తికి మరో రాజకీయ నాయకునితో కూడా దగ్గర సంబం ధం ఉంది…అదెలాగంటే మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కు ఎంవీవీఎస్ మూర్తి స్వయానా వియ్యంకుడు.