ఆసీస్‌ గడ్డపై కోహ్లీ సేన చారిత్రక సిరీస్‌ విజయం–

సిడ్నీ: టీమిండియా దశాబ్దాల కల నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచి సగర్వంగా నిలిచింది. 4 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకోవడంతో 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆసీస్‌ గడ్డపై ఇన్నేళ్ల తర్వాత తొలి టెస్టు సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుని చరిత్ర స ష్టించింది. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కోహ్లీ సేన ముద్దాడి విదేశీగడ్డపై సత్తా చాటింది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.

3-1తో ముగించాలనుకున్నా..

వరుణుడు అంతరాయం కలిగించడంతో ఆఖరి రోజు ఆట రద్దై చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్‌ను 3-1తో ముగించాలన్న భారత ఆశలు మాత్రం నెరవేరలేదు. మూడో టెస్టు గెలుపుతోనే భారత్‌కు సిరీస్‌ విజయం దాదాపు ఖాయమైంది. ఇక చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా పట్టుబిగించి ఆసీస్‌ను ఫాలోఆన్‌లోకి నెట్టింది. దీంతో అందరూ సిరీస్‌ను విజయంతో ముగిస్తారని అనుకున్నారంతా. అయితే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

కుల్‌దీప్‌ 5 వికెట్లతో విజ ంభించడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్‌ అయింది. 322 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్‌.. ఆసీస్‌ను ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. వెలుతురులేమితో నాలుగో రోజు ఆట నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో నాలుగో రోజు ఆట ముగిసింది. వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగించడంతో ఐదో రోజు ఆట ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచి పెట్టుకుపోయింది. దీంతో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు నమోదు చేసిన భారత నయావాల్‌ పుజారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ -662/7 డిక్లేర్డ్‌, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ – 300, ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ – 6/0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *