స్వాతిముత్యం స్టోరీ లేపేసారా?

అవెంజర్స్‌ దెబ్బకి వాయిదా పడ్డ సినిమాలలో ఒకటైన ‘సీత’ మే ద్వితియార్ధంలో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని తేజ ‘స్వాతిముత్యం’ కథ స్ఫూర్తితో తీసాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వాతిముత్యం తరహా క్యారెక్టర్‌ అయిన హీరోకీ, ఒక పొగరుబోతు, అవకాశవాది హీరోయిన్‌కి మధ్య రొమాంటిక్‌ రిలేషన్‌ ఏర్పడితే ఎలా వుంటుందనేది కాన్సెప్ట్‌ అట. ఇటీవల విడుదలైన ‘మజిలీ’ చిత్రానికి కూడా కె. విశ్వనాధ్‌ చిత్రం ‘సాగరసంగమం’ స్ఫూర్తి అనేది తెలిసిందే. అదే కాన్సెప్ట్‌కి కాంటెంపరరీ బ్యాక్‌డ్రాప్‌ సెట్‌ చేస్తే మంచి హిట్‌ అయింది. కనుక విశ్వనాధ్‌ స్క్రీన్‌ప్లేకి ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్‌ అయ్యే శక్తి వుందని తేలింది. మరి తేజ ఎంతవరకు స్వాతిముత్యం స్క్రీన్‌ప్లే ఫాలో అయ్యాడనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ న్యూస్‌ నిజమే అయితే కనుక కమల్‌హాసన్‌ చేసిన పాత్రని బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేయడం సాహసమే అనాలి. విడుదల వాయిదా పడిన తర్వాత మళ్లీ పబ్లిసిటీ తగ్గించిన సీత కాస్త జోరు పెంచాల్సిన అవసరముంది. వారానికో కొత్త సినిమా వస్తోన్న టైమ్‌లో విడుదలకి ముందే ఎంత ఆసక్తి రేకెత్తిస్తే అంత మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *