అలాంటి కథను మహేష్ ఎలా ఒప్పుకుంటాడు?

ఆ కథనే విక్రమ్ కుమార్ ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో ‘గ్యాంగ్ లీడర్‌’గా తీస్తున్నట్లు సమాచారం. ఇందులో హీరో ఐదుగురు లేడీస్‌కు గ్యాంగ్ లీడర్‌గా ఉంటారు. ఆ ఐదుగురూ వివిధ వయసుల వాళ్లు. వారిని కాపాడటమే అతడి టాస్క్. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంటుగా ఉండి.. క్లాస్‌గా సాగిపోయే కథ ఇదని సమాచారం. థ్రిల్లర్ లక్షణాలు ఉంటాయట. ఐతే ఐదుగురు లేడీస్‌ను కాపాడే సింపుల్ క్యారెక్టర్లో తాను చేయడం ఏంటి అని మహేష్ వెనక్కి తగ్గాడట. ఇది తన లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడికి సరి కాదని అనుకున్నాడట. ఐతే నానికి ఇలాంటి ఇమేజ్ హద్దులేమీ లేవు. ఏ కథనైనా చేసేయగలడు. కాబట్టే ‘గ్యాంగ్ లీడర్’ మరో మాట లేకుండా ఒప్పేసుకున్నాడు. కొన్ని నెలల పాటు బన్నీ కోసం ఒక స్క్రిప్టు తయారు చేసి అతడిని మెప్పించలేకపోయిన విక్రమ్.. అది క్యాన్సిల్ కాగానే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా మహేష్ కోసం తయారు చేసిన ‘గ్యాంగ్ లీడర్’ కథనే నానితో చేసేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *