గ్రామ స్థాయిలో నీటి ఎద్దడిని నివారిస్తాం ..————-

జిల్లా పంచాయితీ అధికారి కృష్ణకుమారి—————–

విశాఖపట్నం, ఫీచర్స్‌ ఇండియా : జిల్లా వ్యాప్తంగా ఉన్న 39 మండలాలు, 925 పంచాయితీలకు గాను 5,400 గ్రామాల్లో ఉన్న పంచాయితీ ఓటర్ల లిస్టు సిద్ధంగా ఉందని జిల్లా పంచాయితీ అధికారి కృష్ణకుమారి తెలిపారు. బుధవారం డివిజనల్‌ స్థాయి అధికారులతో జిల్లా పంచాయితీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. బోర్ల రిపేరు, ట్యాంకర్లు ద్వారా నీటి సరఫరా తదితర అన్ని సదుపాయాలతో గ్రామాల్లో త్రాగునీరు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా గురువారం జిల్లా కలెక్టర్‌ కాటమనేని భాస్కర్‌తో జరగబోయే వీడియో కాన్ఫెరెన్స్‌లో చర్చించాల్సిన అంశాలపై జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌వోలు, ఎండీవోలు తదితర అధికారులంతా సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఈనెల 20న ఓటరు లిస్టును వెల్లడిస్తామన్నారు. సుమారుగా 18లక్షల మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ సమావేశంలో నర్శీపట్నం డివిజనల్‌ అధికారి ఆర్‌.శిరీషారాణి, విశాఖపట్నం డివిజన్‌ సూపరింటిండెంట్‌ కె.ఎన్‌.కుమార్‌, పాడేరు డివిజన్‌ సూపరింటిండెంట్‌ ఎ.వి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *