సిట్‌ నివేదికలో దోషులకు శిక్ష తప్పదు

వైకాపా అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి——————–

విశాఖపట్నం, ఫీచర్స్‌ ఇండియా : విశాఖ భూ కుంభకోణంపై గత ప్రభుత్వ హయాంలో వేసిన సిట్‌ నివేదికను బహిర్గతం చేస్తామని, నివేదికలో పొందుపరిచిన దోషులందరికీ శిక్ష పడేలా చేస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం వైసీపీ నగర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అవకతవకలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. డ్రగ్స్‌, గంజాయి తరలింపు, మట్టి, ఇసుక ఇలా.. అన్ని గత టీడీపీ హయాంలో దోపిడీకి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లు కాలయాపనతో చంద్రబాబు అగ్రిగోల్డ్‌ బాధితులను కష్టాలు పాల్జేశారన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటపై రూ. 1150 కోట్లు కేటాయింపు తో అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాలనే ఆశ్చర్యానికి కలిగిస్తోందన్నారు. గ్రామ సచివాలయ పాలన ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలను సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిజం చేశారన్నారు. అవినీతి రహితంగా జగన్మోహన్‌ రెడ్డి అందించే పాలనలో అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఫరూఖీ, రొంగలి జగన్నాధం, రాజబాబు, రామన్నపాత్రుడు, బోని శివరామకృష్ణ, నీలాపు కాళిదాసురెడ్డి, వాసుగౌడ్‌, శ్రీదేవి వర్మ, శ్యామ్‌కుమార్‌రెడ్డి, రాంప్రసాద్‌, సనపల భరత్‌, సుందరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *