సెంబ్‌కార్ప్‌పై బ్రెజిల్‌లో కేసులు… అమరావతిలో కానుకగా భూములు

సింగపూర్‌ కాంట్రాక్ట్‌లపై విచారణ జరిపించాలి————-

సింగపూర్‌ సంస్ధలకు కేటాయించిన భూములు రద్దు చేయాలి————

‘సింగపూర్‌’ స్విస్‌ ఛాలెంజ్‌పై విచారణ జరిపించాలి———-

ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కృష్ణంరాజు————-

గుంటూరు, ఫీచర్స్‌ ఇండియా : అమరావతిలో అంకుర నగర నిర్మాణానికి సింగపూర్‌ కంపెనీలకు కట్ట బెట్టిన భూములను వెంటనే వెనక్కి తీసుకుని, ఆ కంపెనీ అనుమానాస్పద కార్యకలాపాలపై దర్యాప్తు జరిపించాలని ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.వి.ఆర్‌. కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి మీడియా సెంటర్‌లో బెటర్‌ ఆంధ్రప్రదేశ్‌ (బాప్‌) కన్వీనర్‌ డి.ఎస్‌.ఎన్‌.వి. ప్రసాదబాబుతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ, అమరావతిలో 1691 ఎకరాలు పొందిన సింగపూర్‌ కంపెనీల్లో ఒకటైన సెంబ్‌కార్ప్‌ బ్రెజిల్‌ డ్రిల్లింగ్‌ రిగ్గుల కాంట్రాక్టు పొందడానికి పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చినట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. ఈ కంపెనీ బ్రెజిల్‌లో 12 డ్రిల్లింగ్‌ రిగ్గుల నిర్మాణ కాంట్రాక్ట్‌ పొందడానికి బ్రెజిల్‌ మంత్రులకు, ప్రభుత్వ రంగ సంస్ధ అయిన పెట్రోబ్రాస్‌ అధికారులకు 9.50 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల లంచం ఇచ్చిందని నిర్ధారణ అయిందని, ఫలితంగా బ్రెజిల్‌ మాజీ ప్రధాని మైకేల్‌ తీమెర్‌ను గత నెలమార్చి 21 అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారని కృష్ణంరాజు తెలియజేశారు. ఆయనతో పాటు బ్రెజిల్‌ పోలీసులు ఈ కేసులో ఇద్దరు ఆర్ధిక మంత్రులతో సహా అనేక మంది అధికారులను కూడా అరెస్ట్‌ చేశారన్నారు. సెంబ్‌కార్ప్‌ ఈ కేసునుంచి బైట పడటానికి బ్రెజిల్‌కు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి వచ్చిందని ఈ సంఘటన తర్వాత ఆ కంపెనీ షేర్లుభారీగా పతనమయ్యాయని కృష్ణంరాజు తెలిపారు. సింగపూర్‌ మంత్రి ఎస్‌. ఈశ్వరన్‌ గతంలో ఈ వివాదాస్పద కంపెనీకి డైరక్టర్‌గా ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆయనకు చక్కటి స్నేహం, అవగాహన ఉందనేది అందరికి తెలిసిందేనని కృష్ణంరాజు అన్నారు. సెంబ్‌కార్ప్‌ డెవలప్‌మెంట్‌ సంస్ధతో పాటు అసెండాస్‌ – సింగ్‌బ్రిడ్జ్‌ అనే మరో సింగపూర్‌ కంపెనీ కలిసి అమరావతిలో సీడ్‌ కేపిటల్‌ నిర్మాణా నికి బిడ్‌ వేస్తాయని ఈశ్వరన్‌ 2015 జులై 20న ప్రకటించారని ఆయన సలహా మేరకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సంస్ధలకు వివాదాస్పద స్విస్‌ చాలెంజ్‌ పద్దతిన 6.84 చదరపు కిలోమీటర్ల (1,691 ఎకరాలు) ప్రాంతాన్ని ఆ కంపెనీలకు అప్పగిస్తూ 2017 మే 15న నిర్ణయం తీసుకు న్నారన్నారు. అయితే వీటిలో ఒకటైన సెంబ్‌కార్ప్‌ కార్యకలాపాలు అవినీతి మయంగా ఉన్నాయని ఇప్పటికే రుజువైందని అందువల్ల సింగపూర్‌ కంపెనీ లకు కేటాయించిన భూములు వెనక్కు తీసుకోవాలని కోరారు. స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో లోటుపాట్లపైన, ఈ లావాదేవీలపై వచ్చిన అవినీతి ఆరోపణ లపైనా విచారణ జరిపించాలని కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధిం చారు. ఈ సమావేశంలో బాప్‌ కో- కన్వీనర్‌ డాక్టర్‌ కె. రాజేంద్రప్రసాద్‌, ఎడిటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరు శ్రీనివాసరావు, అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌ పి. ఆసిఫ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *