నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మొదట వైఎస్‌ జగన్‌ ప్రమాణం————————

అమరావతి, ఫీచర్స్‌ ఇండియా : తొలి క్యాబినెట్‌ సమావేశంతోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశ మంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వ కారణన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని వెల్లడిం చారు. తొలుత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారని చెప్పారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్‌, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు. ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్‌ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

సీఎం జగన్‌కు ఆర్టీసీ జేఏసీ కతజ్ఞతలు

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఏపీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు, జేఏసీ నేతలు చర్చలు జరిపారు. చర్చల అనంత రం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. యాజమాన్యంతో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. 26 అంశాలపై ఎంవోయూ ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆర్థికపరమైన అంశాలు సీఎం దష్టికి తీసుకెళ్తామని జేఏసీ నేతలు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నందుకు సీఎం జగన్‌కు జేఏసీ నేతలు కతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *