శ్రీలక్ష్మి ఆశలపై జగన్‌ నీళ్లు చల్లేసినట్టేనా?

అమరావతి, ఫీచర్స్‌ ఇండియా: ఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి గుర్తున్నారు కదా. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే కోటి ఆశలతో ఏపీలో అడుగుపెట్టిన శ్రీలక్ష్మీ ఇప్పటిదాకా ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. వైఎస్‌ హయాంలో జరిగిన అక్రమాల కారణంగా జైలుకెళ్లి వచ్చిన శ్రీలక్ష్మికి జగన్‌ సీఎం కావడంతో కీలక బాధ్యతలు దక్కబోతున్నాయన్న ప్రచారం ¬రెత్తింది.

అందుకు అనుగుణంగానే శ్రీలక్ష్మీ కూడా జగన్‌ సొంత జిల్లా కడపలోని కోదండరాముల వారిని దర్శించుకుని మరీ జగన్‌ పిలుపు కోసం వేచి చూస్తూ కూర్చున్నారు. అయితే ఇప్పటిదాకా ఆమెకు జగన్‌ నుంచి పిలుపు వచ్చిందా?… లేదంటే అటు నుంచి అటే వెళ్లిపొమ్మని జగన్‌ చెప్పారా? అన్న విషయంపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.

శ్రీలక్ష్మీ పూర్వాశ్రమం గురించిన విషయానికి వస్తే.. తన బ్యాచ్‌ లో టాపర్‌ గా నిలిచిన శ్రీలక్ష్మి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై వైఎస్‌ హయాంలో గనుల శాఖలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఏకంగా జైలుకెళ్లారు. చాలా కాలం పాటు జైల్లోనే ఉండటంతో తీవ్ర మానసిక వేదినకు గురి అయిన శ్రీలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో జైలు బయటకు వచ్చారు. అప్పటికే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోగా…. తెలంగాణ కేడర్‌ కు వెళ్లిపోయిన ఆమెకు కేసీఆర్‌ సర్కారు పోస్టింగ్‌ ఇచ్చినా పెద్దగా ప్రాధాన్యం కనిపించలేదు. అయితే ఏపీలో జగన్‌ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రాగానే… శ్రీలక్ష్మికి మళ్లీ ఊపిరి వచ్చినట్టుగా కనిపించారు.

జగన్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తనను తెలంగాణ కేడర్‌ నుంచి ఏపీ కేడర్‌ కు బదిలీ చేయాలంటూ ఆమె చేసుకున్న వినతికి అన్ని వైపుల నుంచి సానుకూల సంకేతాలు లభించాయి. రేపో, మాపో ఏపీకి కేడర్‌ లో చేరిపోయే శ్రీలక్ష్మి మళ్లీ తన వైఎస్‌ ఫ్యామిలీ చెప్పినట్టుగానే నడిచిన శ్రీలక్ష్మికి జగన్‌ హయాంలో కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయన్న వార్తలు కూడా వినిపించాయి. జగన్‌ కీలకంగా భావిస్తున్న నవరత్నాల అమలు బాధ్యత శ్రీలక్ష్మీకే అప్పగిస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా చర్యలేవిూ కనిపించడం లేదు. ఈ కారణంగానే అసలు శ్రీలక్ష్మీ విషయంపై జగన్‌ ఏమైనా ఆలోచించారా? లేదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *