పట్టించుకోని కార్మికశాఖ అధికారులు————-
ములగాడ, ఫీచర్స్ ఇండియా : కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ల కార్మికులకు విధులకు హాజరైన ప్రతీరోజూ ప్రయాణపు ఖర్చుల కింద 80 రూపాయలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా పారిశ్రామిక ప్రాంతంలోని హెచ్పీసీఎల్, కోరమండల్, డాక్ యార్డ్, షిప్ యార్డ్ పరిశ్రమల్లో వేల మంది కార్మికులు పనులు నిర్వర్తిస్తు న్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ ఒక్క కార్మికుడికి ప్రయాణ ఖర్చులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో పాటు పనికి తగ్గ వేతనం కూడా చెల్లించకుండా కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం కార్మికుల కష్టాన్ని దోచుకుంటూ కుబేరులు అవుతున్నారు. ఇదిలా ఉంటే హెచ్పీసీఎల్ యాజమాన్యం కర్మాగారంలో ప్రభుత్వ నిబంధన లకు సంబంధించి జనవరి నెలలో కాంట్రాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రతి కార్మికు నకు రీయంబర్స్ మెంట్ పద్ధతిలో కార్మికులకు చెల్లించి ఆ తర్వాత యాజమాన్యానికి బిల్లు పెట్టుకోవాలని కాంట్రాక్టర్లకు జరిగింది. కానీ ఈ పద్ధతిని పాటించకుండా కార్మికులకు అన్యాయం చేస్తూ వారి కష్టాన్ని దోచు కుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. అయితే కర్మాగారంలో కాంట్రా క్టర్లకు ఈ రీయంబర్స్ మెంట్ పద్ధతి వరంగా మారింది. కాంట్రాక్టర్లు కార్మికు లకు ప్రతి నెల జీతంలో పాటు ప్రయాణం ఖర్చులు ఇవ్వాల్సి ఉండగా ప్రయాణ ఖర్చులు ఇవ్వకుండా ఇచ్చినట్టు యాజమాన్యానికి చూపిస్తూ బిల్లులు పెట్టుకోవడం జరుగుతుందని కార్మికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని కాంట్రాక్టులను నిలదీస్తే కార్మికులకు ఉన్న ఉపాధి కోల్పోతారని భయంతో చెప్పలేక మింగలేక పరిస్థితిలో ఉన్నారు. అన్ని విషయాలు తెలిసినా ఒకవైపు యాజమాన్యం మరోవైపు కార్మిక శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కార్మికుల ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం అవుతుంది. కాంట్రాక్టు కార్మికులకు పెద్దఎత్తున మోసం చేస్తున్న యాజమాన్యం మాత్రం వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యం పై పలు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఇకనైనా కార్మిక శాఖ, జిల్లా మంత్రులు, జిల్లా యంత్రాంగం స్పందించి కాంట్రాక్టర్లకు చేస్తున్న మోసాన్ని అడ్డుకట్ట వేయాలని కార్మికులు కోరుతున్నారు.