హైదరాబాద్‌, ఫీచర్స్‌ ఇండియా :జగన్‌లా కాకుండా పూర్తి స్థాయిలో 175 నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆయన భావి స్తోన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఏపీలో పవన్‌ పాదయాత్ర మొదలైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారం చేప ట్టేంత కాకపోయినా.. కనీసం 20 సీట్లు సాధించి అసెంబ్లీలో తన వాణి గట్టిగా వినిపిం చాలని అనుకున్నారు. కానీ పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు. అసెంబ్లీలో జనసేన పార్టీ సింగిల్‌ సీటుకే పరిమితమైంది. రెండు స్థానాల్లో పోటీచేసిన పవన్‌ కల్యాణ్‌ ఒక్కచోట కూడా గెలవలేకపోయారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని భావిస్తున్న పవన్‌.. 2024 వరకు జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. నాలుగేళ్ల ప్రజల్లోనే తిరుగుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర తరహాలో సుదీర్ఘయాత్రకు ప్లాన్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఎన్నికల వరకు.. అంటే నాలుగేళ్ల పాటు పాదయాత్ర చేసి ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారట పవన్‌.

పాదయాత్ర ఈ పేరుకి ఏపీలో చాలా పాపులారీటి ఉంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు, జగన్‌.. ఇలా అందరూ అధికారానికి దూరంలోగా ఉన్నప్పుడు కాళ్లకు చక్రాలు కట్టుకొని రాష్ట్రమంతా తిరిగిన వాళ్లే..! తాజాగా జగన్‌ కూడా పాదయాత్ర తరువాతే అనూహ్య మెజా రీటితో అధికారంలోకి వచ్చారు. ఇదే పార్మాలాను ఫాలో అయ్యేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని పవన్‌ ప్లాన్‌ చేస్తోన్నాట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రాష్ట్ర మొత్తం పాదయాత్ర చేయడానికి పవన్‌ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రూట్‌ మ్యాప్‌తో పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందే జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాల్లో 3,600 కిలోవిూటర్లు జగన్‌ పాదయాత్ర చేశారు. ఈ పర్యటనతో నియోజకర్గాలవారిగా నేతలతో ముఖాముఖీలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జగన్‌ ఎంతగానో శ్రమించారు. అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.

పవన్‌ భీమవరం పర్యటన సమయంలో జగన్‌ పాదయాత్రను మెచ్చుకుంటనే.. తాను కూడా పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. జగన్‌ మోహన్‌ రెడ్డి కష్టపడ్డారు కాబట్టే ఇంతటి మెజార్టీ వచ్చిందని.. మన పార్టీ నాయకులు కూడా ప్రజల్లోకి వెళ్లి పని చేస్తేనే పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారట. అందులో భాగంగానే పాదయాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచనకు పవన్‌ వచ్చినట్లు సమాచారం. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ముందుచూపుతోనే తాను రాజకీయల్లోనికి వచ్చానని ఇప్పటికే పలు మార్లు వ్యాఖ్యానించిన పవన్‌.. ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ఆ దిశగా అడుగులు వేయడం పార్టీలో నూతన ఉత్సహాన్ని నింపుతుందని పార్టీలో కీలక నేత వ్యాఖ్యనించారు.

మరోవైపు పవన్‌ పాదయాత్ర అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి నుంచే పాదయాత్ర చేయడం కరెక్ట్‌ కాదనే వాదనలు కొంతమంది వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తే పార్టీకి ఉపయోగపడుతుందని.. ఇప్పటి నుంచి చేస్తే ఎన్నికల వచ్చే సమయానికి ప్రజలు మర్చిపోతారని అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల పాటు పాదయాత్ర చేయాలంటే పార్టీ ఆర్థికంగా బలంగా ఉండాలని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఏదేమైనా పాదయాత్ర చేయాలని పవన్‌ పట్టుబట్టుతున్నట్లు సమాచారం. జగన్‌ లా కాకుండా పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆయన భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఏపీలో పవన్‌ పాదయాత్ర మొదలైయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు భారత్‌ లో రాజకీయ ఆశ్రయం కల్పిం చాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీటీఐ తరఫున ఖైబర్‌ పఖ్తున్వా ప్రావిన్స్‌లోని బారికోట్‌ రిజర్వ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బల్దేవ్‌ కుమార్‌ పాక్‌లో మైనారిటీలకు రక్షణ లేదని ఆరోపించాడు. ఈ క్రమంలో భారత్‌లో తనకు ఆశ్రయం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం బల్దేవ్‌ మూడు నెలల వీసాపై భారతదేశంలో ఉన్నాడు. ఆగస్టు 12న ఆయన భారతదేశానికి వచ్చాడు. బల్దేవ్‌ ఇండియా రావడానికి ముందే తన భార్య, పిల్లలను లూధియానా ఖన్నాలోని వారి బంధువుల వద్దకు పంపాడు. ప్రస్తుతం పాక్‌లో మతపరమైన మైనారిటీలపై హింస పెరిగిపోయిందని.. అందువల్లే తన కుటుంబాన్ని పాక్‌ నుంచి ఇండియాకు పంపించాల్సి వచ్చిందని తెలిపాడు. అంతేకాక తాను తిరిగి పాక్‌ వెళ్లాలని కోరుకోవడం లేదన్నాడు బల్దేవ్‌. తన కుటుంబ భద్రత గురించి తాను భయపడతున్నానని.. అందుకే భారతదేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నానని బల్దేవ్‌ తెలిపాడు. ఈ క్రమంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ మీద విమర్శల వర్షం కురిపించాడు బల్దేవ్‌. నూతన పాకిస్తాన్‌ను నిర్మిస్తానని ప్రమాణం చేసిన ఇమ్రాన్‌ ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆరోపించాడు. పాక్‌లో హిందువులు, సిక్కులపై దారుణాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకోవాలని కోరాడు. అంతేకాక భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీ తన విన్నపాన్ని మన్నించి భారత్‌లో ఆశ్రయం కల్పిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశాడు. బల్దేవ్‌ కుమార్‌ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లూధియానా ఖన్నాలోని సమ్రాలా మార్గ్‌ ప్రాంతంలో రెండు గదుల ఇంట్లో అద్దెకుంటు న్నాడు. బల్దేవ్‌ కుమార్‌ 2007లో పంబాజ్‌ ఖన్నా ప్రాంతానికి చెందిన భావనను వివాహం చేసుకున్నాడు. ఆమెకు భారతీయ పౌరసత్వం ఉంది. కాగా బల్దేవ్‌ ఇద్దరి పిల్లలు పాక్‌ పౌరసత్వం పొందారు. 2016 ఖైబర్‌ పఖ్తున్వా ప్రావిన్స్‌ ఎమ్మెల్యే సోరన్‌ సింగ్‌ హత్య కేసులో బల్దేవ్‌పై ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *