అమరావతి, ఫీచర్స్‌ ఇండియా : ‘చలో ఆత్మకూరు’ కు తన నివాసం నుంచి బయల్దేరుతున్న తనను గహ నిర్బంధం చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. తమ పార్టీ చలో ఆత్మకూరు కార్యక్ర మానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగు తున్న తెదేపా నేతల నిర్బంధ కాండపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఈ పరిస్థితులు చాలా దారుణ మని, దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తనను గహనిర్బంధం చేశార న్నారు. అమరావతిలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమా నికి వచ్చే తమ పార్టీ నాయకులను గహనిర్బంధం చేశా రని ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడం.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పడం మంచి పద్ధతికాదని మండిపడ్డారు. ఆత్మకూరులో 120 ఎస్సీ కుటుంబాలు శిబి రంలో ఉంటే అక్కడికి భోజనాలు కూడా రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ ఇంట్లోకి పనివాళ్లను కూడా రానీయకుండా అడ్డుకున్నారని.. పోలీసు లు అత్యుత్సాహంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలన్నీ పాలించే వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబి స్తోందన్నారు. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. తనను ఎన్ని రోజులు గహనిర్బంధం చేస్తారో చూస్తాన న్నారు. మొత్తం 540 బాధిత కుటుంబాలను తమతమ గ్రామాలకు తరలించేవరకు తమ పోరాటం కొనసాగు తుందని చంద్రబాబు స్పష్టంచేశారు. మనిషికి జీవించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ, వారి ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వీటిని పోలీసులు అమలు చేయాలన్నారు. బాధితులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు నిన్నటి వరకు తాము గడువు ఇచ్చామని.. ఈ రోజు చలో ఆత్మకూరుకు బయల్దేరితే తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని రద్దు చేసుకొనే ప్రస్తే లేదని తేల్చి చెప్పారు. అరెస్టులు, నిర్బంధాలతో చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని అడ్డుకోలేరన్నారు. తమ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆపలేరన్నారు. చలో ఆత్మకూరు కొనసాగుతుందని స్పష్టంచేశారు. సమస్య పరిష్కారమయ్యేవరకూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.

అనుమతించే దాకా కారులోనే కూర్చుంటా!

మరోవైపు చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా అధినేత ఆత్మకూరు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు ఆయనను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గేటుకు తాళం వేశారు. దీంతో చంద్రబాబు తన కారులోనే కూర్చొన్నారు. తనను చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించేదాకా అక్కడే వుంటానని ఆయన పోలీసులకు తేల్చి చెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *