సైరా సౌత్‌ రికార్డు !

అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘సైరా’ విడుదలకు ముందే బిజినెస్‌పరంగా సంచలనాల్ని సష్టిస్తున్నది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులు దాదాపు 40కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోయాయని సమాచారం. ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా అందుబాటులోకి రానుంది. డిజిటల్‌ రైట్స్‌కు ఇంత భారీ మొత్తంలో ఆర్జించడం దక్షిణాదిన ఓ రికార్డ్‌ అని భావిస్తున్నారు. 18 శతాబ్దానికి చెందిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొంది స్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాత. అమితాబ్‌బచ్చన్‌, విజయ్‌సేతుపతి, సుదీప్‌, నయనతార, తమన్నా ప్రధాన పాత్రధారులు. అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *