మెగాస్టార్‌ చిరంజీవి కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో, కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ తన వంతు సపోర్ట్‌ చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి నట్లు వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌ మధ్య చాలా మంచి స్నేహం ఉంది. అదే స్నేహాన్ని చరణ్‌ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు అదే స్నేహంతో సల్మాన్‌ ఖాన్‌ మెగా ఫ్యామిలీకి సపోర్ట్‌ చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ సహా తమిళ, కన్నడ, మల యాళ భాషల్లో విడుదలవుతుంది. హిందీలో ఫర్హాన్‌ అక్తర్‌, అనిల్‌ టడాన్‌ సినిమాను విడుదల చేస్తున్నారు. హిందీలో వార్‌ సినిమా విడుదలవుతుం డటం కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ మెగా శిబిరంకు సల్మాన్‌ ప్రమోషన్స్‌ విషయంలో ముందుంటానని ప్రామిస్‌ చేయడం ఊరటనిచ్చే అంశంగా మారింది. సెప్టెంబర్‌ 18న హైదరాబాద్‌ ఎల్‌.బి స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. అలాగే బాలీవుడ్‌లో భారీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకి కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని సమాచారం. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా ఈ సినిమా నిర్మితమవుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌, జగపతిబాబు, రవికిషన్‌, నిహారిక, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాను అక్టోబర్‌ 2న విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *