తిరుపతి, ఫీచర్స్‌ ఇండియా : : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇసుక రుచి బాగా తెలిసినట్లుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్మాణరంగాన్ని కుదేలు చేసిందని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. యురేనియం వెలికితీసే పరిశ్రమలకు వ్యతిరేకంగా అన్నిపార్టీలను కలుపుకొంటూ ఆందోళన చేపట్టనున్నట్లు రామక ష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల, ఆళ్లగడ్డలో అఖిలపక్షం పర్యటిస్తోందన్నారు.

ఏపీ గ్రామసచివాలయ ఉద్యోగాల్లో మూడేళ్ల నిబంధన ఉపసంహరించాలని రామకష్ణ డిమాండ్‌ చేశారు. ఈ నెల 13న విజయవాడలో సీపీఐ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సమస్యలపై ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సీఎం జగన్‌ స్పందించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *