గంటూరు, ఫీచర్స్‌ ఇండియా : ఏపీలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో నూతన ఇసుక విధానాన్ని నిరసిస్తూ గుంటూరు భాజపా ఆధ్వర్యంలో ఆయన నిరసన తెలిపారు. పట్నంబజారులో భిక్షాటన చేశారు. ఇసుక కొరతతో భవననిర్మాణ కార్మికులు ఉపాధికోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపాలసీ వచ్చినా సామాన్యులకు ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు. నిర్మాణాలు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందని కన్నా మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.10 వేల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *