కాంగ్రెస్‌లో వలలో పవన్‌కల్యాణ్‌

తెలంగాణలో జనసేన పార్టీలేదు, పార్టీ ఉందని చెప్పుకున్నా క్యాడర్‌ లేదు, ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. మరి తెలంగాణ సమస్యలతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఏంపని? తెలంగాణ ఆర్టీసీ సమ్మె, సమ్మెపై కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి స్పందించలేదు, ప్రతిపక్షనేత కూడా నోరు మెదపలేదు, మరి మూడో కష్ణుడు జనసేనానికి తొందరేమొచ్చింది. కేసీఆర్‌ కి సుద్దులు చెప్పాల్సిన ఆలోచన, అవసరం పవన్‌ కి ఎందుకు అనేదే ఇప్పుడు ప్రశ్న. సేవ్‌ నల్లమల అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ సంబంధించిన వ్యవహారం కావడంతో పవన్‌ స్పందించాడను కుం దాం, కానీ తెలంగాణ ఆర్టీసీతో పవన్‌కి ఏం పనిపడింది. ఇదంతా కేవలం కాంగ్రెస్‌ మెప్పుకోసమే చేస్తున్నారేమో అనిపిస్తోంది. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో మీ సహకారం కావాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జనసేనకు ఓ అర్జీ పెట్టుకున్నారు. ఇలాంటి ఇగో శాటిస్‌ ఫై పనులంటే పవన్‌కి భలే ఇష్టం. తమ మద్దతు కోరి వచ్చిన కాంగ్రెస్‌కు ఎలాంటి హామీ ఇవ్వకుండా పంపించేసిన పవన్‌ కల్యాణ్‌, ఫొటోలు తీసి మాత్రం సోషల్‌ మీడియాలో బాగా ప్రచారం చేసుకు న్నారు. కాంగ్రెస్‌ పార్టీ మా మద్దతు కోరిందహో అంటూ డప్పు కొట్టుకున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కి లబ్ధి చేకూర్చేందుకే పవన్‌ తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో వేలు పెట్టారని భావిస్తున్నారు చాలామంది. ఆర్టీసీ సమ్మెకు, తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన సకల జనుల సమ్మెకు లింక్‌ పెట్టి మంటరాజేసేందుకు తన వంతు ప్రయత్నించారు పవన్‌. వెన్ను నొప్పితో ప్రచారానికి రాలేనని మెలిక పెట్టినా, పవన్‌ ఇలా ప్రెస్‌ నోట్లు రిలీజ్‌ చేస్తూ కావాల్సినంత సాయం చేస్తానని కాంగ్రెస్‌కి మాటిచ్చినట్టున్నారు. అందులో భాగం గానే ఓ శాంపిల్‌ బైటకు వదిలారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కేసీఆర్‌ పాలనపై కూడా పవన్‌ విరుచుకుపడే అవకాశముందని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అది కాంగ్రెస్‌ కి ఏంత మేలు చేస్తుందనే విషయమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్‌ సందేశం విని కాంగ్రెస్‌ కి ఓట్లు వేసేవారు ఎవరున్నారు? నిజంగా పవన్‌ పిలుపునకు స్పందించి ముందుకొచ్చే జనం తెలం గాణలో ఉన్నారా? ఆర్టీసీ వ్యవహారంతో కాస్తో కూస్తో ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై కోపం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ కోపాన్ని ఆర్టీసీ కార్మికుల వైపు తెలివిగా తిప్పేస్తున్నారు కేసీఆర్‌. గతంలో ఇది కాంగ్రెస్‌ సీటే కాబట్టి, ఇప్పుడు మళ్లీ అదే పార్టీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అదేమీ ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి టైమ్‌ లో పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎంతవరకు సపోర్ట్‌ గా ఉంటారనేది తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *