ప్రభాస్‌ నా ఫేవరేట్‌ హీరో : టీమిండియా క్రికెటర్‌ సిరాజ్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ తన ఫేవరేట్‌ సౌతిండియన్‌ యాక్టర్‌ అని టీమిండియా ప్లేయర్‌ మహ్మద్‌ సిరాజ్‌ తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌.. క్రిక్‌ ట్రాకర్‌ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. అభిమాను అడిగిన పు ప్రశ్నకు ఆసక్తికర సమాధానాు చెప్పాడు. అయితే ఫేవరేట్‌ సౌతిండియాన్‌ హీరో, మూవీ ఏంటిదని ఓ అభిమాని ప్రశ్నించగా.. సిరాజ్‌ ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్‌, ‘బాహుబలి’ సినిమా అని తెలిపాడు. తనకు బాహుబలి బిగినింగ్‌ చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్‌ వద్ద కనక వర్షం కురిపించిన విషయం తెలిసిందే. భారతీయ చనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమాతో ప్రభాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ఫాలోయింగ్‌ భించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *