వైరస్‌పై ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొల్పారు

లాక్‌డౌన్‌ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బజాజ్‌ లాక్‌ డౌన్‌ను కఠినంగా అము చేసినా వైరస్‌ విజృం భణను అడ్డుకోలేకపోగా, ఆర్థిక వ్యవస్ధ చిక్కుల్లో కూరుకుపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇన్ఫెక్షన్‌ చైన్‌ను తెంచలేదని, ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అడ్డుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళను నెకొనేలా ప్రచారం సాగిందని, ఇప్పుడు వారి ఆలోచనా ధోరణి మార్చడం కష్టమని వ్యాఖ్యానించారు.కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా సాగిన సుదీర్ఘ లాక్‌డౌన్‌పై పు ప్రశ్ను తలెత్తుతుంటే ప్రభుత్వం వైరస్‌ను నియంత్రించకపోగా జీడీపీని నియంత్రిం చిందని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌పై పోరులో సమతూకంతో వ్యవహరించిన జపాన్‌ తరహా దేశాను మనం అనుసరించకుండా అమెరికా, స్పెయిన్‌, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాను అనుసరించడంతో భంగ పడ్డామని రాజీవ్‌ బజాజ్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *