డ్రైవింగ్‌ లైసెన్స్‌ .. వద్దు అనేశాడట

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం వకీల్‌సాబ్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వరరావు క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్‌. కాగా ఈ సినిమా తర్వాత క్రిష్‌ డైరెక్షన్లో విరూపాక్ష అనే సినిమా కూడా ఆల్రెడీ ప్రారంభించాడు పవన్‌కల్యాణ్‌. కాగా ఈ సినిమా తర్వాత హారీష్‌ శంకర్‌తో మైత్రీ మూవీస్‌ నిర్మించే సినిమాకి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. దాంతో బాటు పవన్‌కు మరో ఆఫర్‌ వచ్చిందని తెలిసింది. ఇటీవ మయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌తో నిర్మించాని కొంతమంది నిర్మాతు కలిసి పవన్‌కు విషయం చెప్పారట. ఒక హీరో, అభిమాని మధ్య ఈగో మధ్య నడిచే ఈ కథ మయాళ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా చూసిన పవన్‌కల్యాణ్‌ ఈ సినిమా తనకు సూట్‌ అవ్వదని స్మూత్‌గా తప్పుకున్నా డట. కంటెంట్‌ బాగానే ఉన్నా తన అభిమానుతో గొడవ పెట్టుకునే క్యారెక్టర్‌ చేయడం ఇష్టం లేకే పవన్‌ అలా చేశాడని అతని సన్నిహితు ద్వారా తెలిసింది. ఒకవేళ ఈ సినిమాని పవన్‌ ఒప్పుకుంటే అతని అభిమాని పాత్రలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ని నటింపచేయానుకున్నారు నిర్మాతు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *