కిమ్‌పై యువరాజ్‌సింగ్‌ అభిమాను మండిపాటు

యువరాజ్‌ సింగ్‌ మాజీ ప్రేయసి, సినీ నటి కివమ్‌ శర్మ చేసి ఓ పోస్టుపై అభిమాను మండి పడుతున్నారు.
గతంలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు కానీ, యువీ వాళ్ల అమ్మ అడ్డుపడడంతో పెళ్లి వరకూ రాకుండానే విడిపోయారు. వీరిద్దరూ వేరేవేరే వ్యక్తుల్ని చేసుకుని సెటిలైపోయారు. కాగా కొద్దిరోజు క్రితం యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోు పలికి ఏడాది పూర్తయింది. వీడ్కోును గుర్తు చేసుకుంటూ అభిమాను ‘మిస్‌ యూ యువీ’ ట్యాగ్‌తో అతడిని తుచుకున్నారు. ఈ సందర్భంగా యువీ మాజీ ప్రేయసి, హీరోయిన్‌ కిమ్‌ శర్మ రియాక్ట్‌ అయ్యారు. గోట్‌ (గేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) అంటూ యూవీని పొగిడేసింది. అయితే దీని అర్థం తెలియని కొందరు ఆమెపై సెటైర్స్‌ వేస్తున్నారు. మరి కొందరు పూర్తిగా రాస్తే నీ సొమ్ము ఏమైనా పోతుందా?.. మొత్తానికి టైమ్‌ సేవ్‌ చేసుకున్నావని కామెంట్స్‌ చేశారు. ఇక కొందరు మాత్రం నిజంగానే గొర్రెను చేశావులే అని నాటి సంగతును నెమరువేసుకున్నారు. ఏదేమైనా కిమ్‌ శర్మ ట్వీట్‌ మాత్రం ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *