మిస్సైల్‌గా మారుతున్న ఎన్టీఆర్‌

యంగ్‌టైనర్‌ ఎన్టీఆర్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందని కొద్ది రోజుగా వినిపిస్తోంది. కాగా ఈ సినిమాకు ఇంతకు ముందు వేరే టైటిల్‌ అనుకున్నారు. అయితే ఆ టైటిట్‌పై ఎన్టీఆర్‌ అంత ఆసక్తి కనబరలేదని దాంతో వేరే టైటిల్‌కి దర్శక, నిర్మాతు ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. తాజాగా ఈ సినిమాకి మిస్సైల్‌ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయాని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర ప్రభావాన్ని బట్టి ఆ టైటిల్‌ అయితేనే కరెక్టుగా ఉంటుందని అనుకుంటుందట చిత్రయూనిట్‌. ఎన్టీఆర్‌ ఎనర్జీకి మిస్సైల్‌ టైటిట్‌ కూడా బాగా సూటవుతుందని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నాడట. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించిన సీన్లు వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని త్రివిక్రమ్‌ సినిమాలో జాయిన్‌ అవ్వాని అనుకుంటున్నాడట. ఈ సినిమాకి అయినను పోయి రావలె అనే టైటిల్‌ను పెట్టానుకుంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఆలియా భట్‌ను ట్రై చేస్తున్నారని సమాచారం. హారిక హాసిని బ్యానర్‌పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *