కృష్ణంరాజుది పూటకో పార్టీ

పార్టీ మారడం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నైజమని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. తామంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టంతోనే గెలిచామని మంత్రి పేర్కొన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఆనాడు టీడీపీ నామినేషన్‌, బీజేపీ నామినేషన్‌, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ఎందుకు విత్‌ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాని డిమాండ్‌ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్‌ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో మోదీకి చెప్పాన్నారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శు చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *