రవితేజతో పవన్‌కల్యాణ్‌ మల్టీస్టారర్‌

టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాు జరుగుతున్నాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాస్‌ రాజా రవితేజ కయికలో రావమ్‌ తాళ్లూరి ఈ సినిమా నిర్మించడానికి సన్నాహాు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రవితేజతో నే టిక్కెట్టు, డిస్కో రాజా చిత్రాల్ని నిర్మించిన రావమ్‌ స్వతహాగా పవన్‌కల్యాణ్‌ఖు మంచి స్నేహితుడు. దాంతోనే పవన్‌ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తొస్తోంది. ఈ చిత్రానికి గోపా గోపా, కాటమ రాయుడు చిత్రా దర్శకుడు డాలీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్‌ కళ్యాణ్‌.. ‘వకీల్‌ సాబ్‌’ సినిమాతో పవన్‌ బిజీగా ఉండగా ఆ తర్వాత క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ‘విరూపాక్ష’.. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో కూడా పవన్‌ ఒక సినిమా చేస్తున్నారు. ఇక మాస్‌ రాజా ప్రస్తుతం క్రాక్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత నక్కిన త్రినాథరావుతో.. రమేష్‌ వర్మతో.. వక్కంతం వంశీతో సినిమాు చేయనున్నాడు. ముందు ఈ సినిమాని తమిళంలో బంపర్‌ హిట్టయిన విక్రమ్‌ వేద రీమేక్‌ చేద్దామనుకున్నారు. అది కాక మరో తమిళ హిట్‌ బోగన్‌ కూడాని కూడా ట్రై చేశారు. కానీ ఇద్దరి మాస్‌ హీరోకు సెట్‌ అయ్యే కథ అయితే బాగుంటుందని వేరే కథ డెవప్‌ చేస్తున్నట్లు తొస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభించి ఆ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాు చేస్తున్నారు. పూర్తి వివరాు మరి కొద్దిరోజు అయితేగాని తెలియవు. కాగా ప్రస్తుతం క్రాక్‌ సినిమా చేస్తున్న రవితేజ రానా దగ్గుబాటితో ఓ మల్టీస్టారర్‌కి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *