నడక ద్వారా కరోనా … !

కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న పెను భూతం. దీని ధాటికి లక్షలాది మంది ప్రాణా కోల్పోగా.. లక్షలాది మంది చావు చివరి అంచు వరకూ వెళ్లి వచ్చారు. కాగా ఇప్పటికీ రాను రాను పెరిగిపోతున్న కరోనా కేసుతో ప్రతి ఒక్కరూ ఏ క్షణానా ఏ ముప్పు వస్తుందో అని భయపడిపోతున్నారు. చిన్న జ్వరంలా అనిపించినా .. దగ్గు వచ్చినా .. జలబు చేసినా విపరీతంగా వణికిపోతున్నారు భయంతో.. అలా అని హాస్పటల్‌కి వెళ్లి టెస్టు చేయిస్తే ఏం జరుగుతుందో అని లోలోప మదన పడుతున్నారు. అయితే సువుగా ఇంట్లోనే ఉండి కరోనా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి చిన్న చిట్కా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేక అధికారి డాక్టర్‌ సి. ప్రభాకర్‌రెడ్డి. కరోనా అనుమానం ఉన్నవారు వంద అడుగు దూరం నడిస్తే కరోనా ఉందో లేదో తెలిసిపోతుందట. వంద అడుగు నడుస్తున్నప్పుడు అయాసం లాంటివి వస్తే కొంత క్షణాల ఉన్నట్లు అనుకోవచ్చట. ఈ ప్రయోగం విజయవాడలో ఒక వందమందితో చేయిస్తే 58 మందికి అయాసం వచ్చిందని, వారిని పరీక్షస్తే ఎనిమిదికి పాజిటివ్‌ వచ్చిందట. ప్రతిసారీ టెస్టు కోసం పరుగు తీసేకంటే ఈ విధానం ద్వారా సొంతంగా పరీక్షించుకుంటే కాస్త ధైర్యంగా ఉండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *