టిక్‌టాక్‌ ప్లేస్‌లో చింగారీ !

మనంతో డాయికి కాు దువ్వుతున్న చైనా దూకుడుకి అడ్డకట్ట వేసే భాగంగా భారత ప్రభుత్వం సోమవారం 59 చైనా యాప్స్‌ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇందులో అందరికీ బాగా తెలిసిన యాప్‌ టిక్‌టాక్‌. సెబ్రిటీ నుంచి సామాన్యుడి వరకూ అందరికీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ కొందరికి ఉపాధిగా మారిన టిక్‌టాక్‌పై బ్యాన్‌పై చాలామంది నిరుత్సాహానికి గురైయ్యారు. ఇప్పుడు అలాంటి వారికి చింగారీ యాప్‌ ఆశాకిరణంలా కనిపిస్తోంది. బెంగళూరుకు చెందిన విశ్వాత్మ నాయక్‌, సిద్ధార్ధ్‌ గౌతమ్‌ు రూపొందించిన ఈ యాప్‌ 2018నుంచి గూగుల్‌ ప్టే స్టోర్‌్‌లో, 2019 నుంచి యాపిల్‌ యాప్‌స్టోర్‌లో లాంచ్‌ అయ్యింది. ఈ యాప్‌ను కూడా ఉచితంగా డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు. దీని ఇంటర్‌ ఫేస్‌ కూడా టిక్‌టాక్‌ తరహాలోనే ఉంటుంది. హిందీ, తొగు, తమిళం, కన్నడం, మయాళం, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, పంజాబీ వంటి భారతీయ భాషను ఈ యాప్‌ సపటోర్‌ చేస్తుంది. ఈ యాప్‌ ద్వారా వీడియోు చేసిన వారికి వచ్చే వ్యూస్‌ ప్రకారం మొదట పాయింట్లు వస్తాయి. అనంతరం వాటిని నగదు కింద మార్చుకోవచ్చు. టిక్‌ టాక్‌ ను నిషేధించినట్లు ప్రకటన రావడంతో ఈ యాప్‌ ను విని యోగదాయి విపరీతంగా డౌన్‌ లోడ్‌ చేసుకుంటున్నారు. చింగారీ సహ వ్యవస్థాపకు సుమిత్‌ ఘోష్‌ దీనికి సంబంధించిన వివరాను విడుద చేశారు. ప్రస్తుతం ప్రతి అరగంటకూ 10 క్ష మంది డౌన్‌ లోడ్‌ చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *