టీడీపీ శవ రాజకీయాల మానుకోవాలి

టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శవ రాజకీయాల చేస్తున్నారని పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్‌రాజ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్స్కెస్‌ ఫార్మా కంపెనీలో మంగళవారం త్లెవారుజామున గ్యాస్‌ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ గాజవాక ఆర్‌కె ఆసుపత్రికి చేరుకొని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన బాధితును పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబా కు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే నష్టపరిహారంగా 12 క్షు ఇచ్చి చేతు దుపుకోలేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అప్పట్లో 25 లక్ష నష్టపరిహారం ఇవ్వాని వైఎస్సార్‌సీపీ తరపున డిమాండ్‌ చేస్తే పట్టించుకోకుండా ఇపుడు కోటి రూపాయిు డిమాండ్‌ చేసే అర్హత వారికి ఎక్కడిదన్నారు. మీరు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి బాధితుకి నష్టపరిహారం ఎంత ఇప్పిం చారో గుర్తు లేదా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీరును ప్రశ్నించారు. పెద్ద మనిషినని చెప్పుకునే మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతు శవ రాజకీయాు మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి ఆదేశాతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షట్‌ డౌన్‌ చేస్తున్నామని, ఈ ప్రమాదంపై కలెక్టర్‌ విచారణకి ఆదేశించారన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనిపిస్తున్నట్లు ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యు తీసుకుంటామని, ఒకవేళ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *