ధోనీ ఎలాంటివాడో అప్పుడే తెలిసింది

ముంబయి 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో యువ క్రికెటర్లతో ధోనీ వ్యవహరిస్తున్న తీరుకి తాను ఫిదా అయిపోయినట్లు టీమిండియా ఫాస్ట్‌ బౌర్‌ ఇషాంత్‌శర్మ తెలిపారు. ‘ మహీని అర్థం చేసుకోవడానికి తనకు ఆరేళ్ల సమయం పట్టిందన్న ఇషాంత్‌.. భారత్‌ జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో ధోనీతో నేను ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు. కానీ 2013 తర్వాత అతనితో నెమ్మదిగా మాట్లాడుతూ.. క్రమంగా మహీని అర్థం చేసుకోవడం ప్రారంభించా. ధోనీతో మాట్లాడితే క్రికెట్‌ గురించే కాకుండా జీవితం గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు. తన గదికి రావొద్దని ఎవరికి చెప్పడు. ఏ ఆటగాడైన మరే సమయంలోనైనా నిరభ్యంతరంగా మహీ గదికి వెళ్లవచ్చు. బౌర్‌ మహ్మద్‌ షమీ ఎక్కువగా ధోనీ రూమ్‌కు వెళ్తుంటాడు. యువ క్రికెటర్లతో ధోనీ చక్కగా మాట్లాడ తాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా చాలా సరదగా వ్యవహరిస్తాడు’అని ఇషాంత్‌ శర్మ వ్లెడిరచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *