సచిన్‌ ఒత్తిడి ఉండకూడదనేవాడు

తన మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని చెప్పేవాడని టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. సచిన్‌ టెండ్కూర్‌ ఓపెనర్‌గా స్ట్రైకింగ్‌ తీసుకోకపోవడానికి కారణాను గంగూలీ తెలిపాడు. ‘సచిన్‌ ఎప్పుడూ స్ట్రైకింగ్‌ తీసుకోవడానికి ఆసక్తి చూపేవాడు కాదు. తొలి బంతిని ఫేస్‌ చేయమని నేనూ తరుచూ చెప్పేవాడిని. ఎందుకంటే ఎప్పుడూ నేనే స్ట్రైక్‌ తీసుకునేవాడిని. దానికి సచిన్‌ రెండు సమాధానాు చెప్పేవాడు. అతను ఫామ్‌లో ఉంటే నాన్‌స్ట్రైక్‌లో ఉంటాననే వాడు. ఫామ్‌లో లేకున్నా నన్నే స్ట్రైకింగ్‌ తీసుకోమనేవాడు. తన మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని చెప్పేవాడు. అలా ఒకటి రెండు సార్లు నేనే నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో నిబడ్డా’ అని గంగూలీ గుర్తుచేసుకున్నాడు. ఇక టీ20ు ఆడడం ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. ‘టీ20ు ఎంతో కీకం. ఇప్పటి తరంలో ఆడాల్సి వస్తే నా ఆటను కచ్చితంగా మార్చుకొనేవాడిని. ఎందుకంటే.. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మన్‌ ఇష్టం వచ్చినట్టు బాదొచ్చు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆడిన ఐదేళ్ల పాటు పొట్టి ఫార్మాట్‌ను ఆస్వాదించా. మరింతకాం ఆడితే బావుండు అనిపిస్తోంది’ అని సౌరవ్‌ గంగూలీ చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *