20 – ట్వంటీ వరల్డ్‌ కప్‌ వాయిదా పడ్డట్టే ?

షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ కారణంగా ఆ టోర్నీని నిర్వహించడం కష్టమని ఇప్పటికే క్రికెట్‌ ఆస్ట్రేలియా తేల్చి చెప్పేసింది. 16 జట్లను వైరస్‌ బారిన పడకుండా చూడడం కష్టమని.. ప్రయాణ, హోటల్‌ గదుకు సంబందించిన సమస్యు వస్తాయని చెప్పింది. ఇక ఖాళీ మైదానాల్లో టోర్నీ నిర్వహించడం కూడా తమకు నష్టం తెచ్చేదని సీఏ పేర్కొంది. ఐసీసీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. ఆస్ట్రేలియాలోని రెండో అతిపెద్ద నగరమైన మెల్‌బోర్న్‌లో బుధవారం అర్ధరాత్రి నుంచి మరో ఆరు వారా పాటు లాక్‌డౌన్‌ విధించింది ఆసీస్‌ ప్రభుత్వం. ఇప్పటికే విక్టోరియాలో పరిస్థితు అదుపు తప్పడంతో.. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ పరిస్థితు చూసిన తర్వాతైనా టీ20 ప్రపంచకప్‌ వాయిదా విషయంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రకటన విడుద చేయాని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *