సౌరవ్‌ను ఎప్పుడూ కవ్వించలేదు

మైదానంలో సౌరవ్‌, నేను కవ్వించుకున్న సందర్భాు ఉన్నాయని దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌ అన్నాడు. టాస్‌ విషయంలో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ వాకు దాదా ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ చూశాక మళ్లీ ఎప్పుడూ కవ్వించలేదన్నాడు. ఎవ్వరైనా సరే అనవసరంగా రెచ్చగొడితే.. దాదా బదులిచ్చే తీరు అద్భుతమని ప్రశంసిం చాడు. మైదానంలో తామిద్దరం కవ్వించుకున్న సందర్భాు ఉన్నాయని స్మిత్‌ తెలిపాడు. సౌరవ్‌ గంగూలీని ఎవరైనా కవ్విస్తే కచ్చితంగా బదులొస్తుందని మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం నేను ఎక్కువ సమయం దాదాతో గడుపుతున్నా. ప్రత్యేకించి క్రికెట్‌ పరిపానకు సంబంధించి చాలా ఎక్కువగా చర్చిస్తున్నాను. అతనెప్పుడూ ప్రశాంతంగా మాట్లాడాని అనిపించే విధంగా ఉంటాడు. దాదా మంచి సంభాషణను ఇష్టపడతాడు’ అని తెలిపాడు. యువ కెప్టెన్‌ కావడంతో కాస్త దుందుడుకుగా ఉండేవాడినని, అయితే గంగూలీ దీటుగా బదులిచ్చేందుకు ఎప్పుడూ వెనుకాడలేదని ఆయన గుర్తుచేసుకున్నాడు. 2003లో 22 ఏళ్ళ వయసులో గ్రేమ్‌ స్మిత్‌ దక్షిణాఫ్రికా జట్టు పగ్గాు అందుకుని చరిత్ర సృష్టించాడు. క్రికెట్‌ చరిత్రలో పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ఎంపికైన మొదటివాడు స్మిత్‌. కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో అద్బుత విజయాు అందించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *