సెహ్వాగ్‌ను ఓపెనర్‌ చేసింది సచినే

 

వీరేంద్ర సెహ్వాగ్‌.. టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌. కానీ కెరీర్‌ ప్రారంభంలో వీరూ.. మిడిలార్డర్‌లోనే ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆస్టానంలోనే బరిలోకి దిగాడు. అయితే సెహ్వాగ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగడానికి నాటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీనే కారణం అని అందరూ అనుకుంటారు. సెహ్వాగ్‌ సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం అతనిదేనని భావిస్తారు. కానీ ఇందులో సచిన్‌ పాత్ర కూడా మరవలేనిదని, సెహ్వాగ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగడానికి గంగూలీ ఎంత కారణమో సచిన్‌ పాత్ర కూడా అంతేనని భారత మాజీ ఓపెనర్‌ అజయ్‌ రత్రా తెలిపాడు.ఓపెనర్‌గా సచిన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ సెహ్వాగ్‌ కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. దీంతో సచిన్‌ అతని కోసం తన ఓపెనింగ్‌ స్లాట్‌ను త్యాగం చేయడానికి సిద్దపడ్డాడు. నెంబర్‌ 4 ఆడుతానని చెప్పాడు. దీంతో సౌరవ్‌ గంగూలీతో కలిసి సెహ్వాగ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ నేపథ్యంలో ఈ ఇద్దరు ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ఒకవేళ సచిన్‌ నాుగో స్థానంలో ఆడుతానని చెప్పకుంటే.. సెహ్వాగ్‌ ఓపెనర్‌గా ఆడేవాడు కాదు. అదే జరిగి ఉంటే సెహ్వాగ్‌ క్రికెట్‌ కెరీర్‌ భిన్నంగా ఉండేది.’అని అజయ్‌ రత్రా తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *