రామ్‌చరణ్‌తో జాన్వీ కపూర్‌

 

శ్రీదేవి తనయురాు జాన్వీకపూర్‌ టాలీవుడ్‌లో నటించబోతుందని తాజా సమాచారం. మెగాస్టార్‌ చిరంజీవి – డైరెక్టర్‌ కొరటా శివ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా రామ్‌ చరణ్‌కి జోడీగా జాన్వీ నటించబోతుందని వార్తు వచ్చాయి. అయితే తమన్నా ఈ రోల్‌ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ డేట్స్‌ ఇష్యూ వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ని ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నారట. ఈ సినిమాలో చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా నటిస్తున్నా డని.. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాు.. ప్రభుత్వ భూము కబ్జాు తదితర అంశాతో సందేశా త్మకంగా ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇక ‘ఆచార్య’లో కాజల్‌ హీరోయిన్‌ మెయిన్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా రెజీనా కాసాండ్రా స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ‘ఆచార్య’లో అతిధి పాత్రలో కనిపించనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కొణిదె ప్రొడక్షన్స్‌ పై రామ్‌ చరణ్‌ మరియు మాట్నీ మూవీస్‌ నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా కీక పాత్రలో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *