పూరీ లైన్లోకి మళ్లీ వచ్చాడా ?

మెగాస్టార్‌ చిరంజీవికి వీరాభిమాని దర్శకుడు పూరీ జగన్నాధ్‌. ఆ విషయాన్ని పు బహిరంగ వేదికపై ప్రక టించిన పూరీ జీవితంలో ఒక్క సినిమా అయినా అన్నయ్యతో తీస్తానని తెలిపాడు కూడా. కాగా చిరంజీవి రీ ఎంట్రీ మూవీకి పూరీనే దర్శకుడు కావాల్సిందే. ఆటో జానీ పేరుతో పూరీ చెప్పిన కథ చిరుకు నచ్చిన సెకాండాఫ్‌ నచ్చకపోవడంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇస్మార్ట్‌ శంకర్‌తో ఫామ్‌లోకి వచ్చిన పూరీ మళ్లీ చిరుతో సినిమా చేయడానికి సన్నాహాు చేస్తున్నాడట. పూరి ఎంతో సైలెంటుగా మెగాస్టార్‌ చిరంజీవిని కలిసి స్టోరి వినిపించారని గుసగుసు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్టికి లాక్‌ డౌన్‌ సమయంలో చిరు తీరిక సమయాన్ని చూసి పూరి మళ్లీ కలిసాడట. ఆ ఇద్దరూ స్క్రిప్టును డిస్కస్‌ చేసారా లేదా? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. అయితే పూరి కయిక మాత్రం కచ్ఛితంగా సినిమా గురించే. ప్రస్తుతం చిరు ఆచార్య చిత్రంతో బిజీ. అలాగే పూరి ఫైటర్‌ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఈలోగానే చిరు కోసం పూర్తి స్క్రిప్టు రెడీ చేస్తాడన్నమాట. అన్ని కుదరితే తర్వాత చిరంజీవి చేయబోయే ూసిఫర్‌ రీమేక్‌ తర్వాత చేయబోయే సినిమా పూరీదే అనే రూమర్స్‌ గట్టిగానే వినినిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *