నాగార్జున‌ యాక్షన్‌ షురూ

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఇప్పటికే న్యూ డైరెక్టర్‌ స్మాన్‌ దర్శకత్వంలో ‘వైల్డ్‌ డాగ్‌’ అనే యాక్షన్‌ థ్ల్రిర్‌ సినిమాలో నటిస్తున్న నాగ్‌.. తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘రైడ్‌’ రీమేక్‌ హక్కు కూడా దక్కించుకున్నాడు. 2018లో అజయ్‌ దేవగన్‌ హీరోగా రూపొందిన రైడ్‌ సినిమా.. ఇన్కమ్‌ టాక్స్‌ కుంభకోణం నేపథ్యంలో సాగుతుంది. ఐటి శాఖలో జరుగుతున్న చీకటి కోణాను బయట పెట్టే విధంగా.. నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమాకి డైరెక్టర్‌ కోసం వెతుకుతున్నాడు నాగ్‌. ఇదిలా ఉండగా.. ఇటీవలే గరుడవేగా సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ సినిమా చేయడానికి నాగ్‌ ఓకే చెప్పారు. ఈ సినిమాను ఆసియన్‌ సినిమాస్‌ వారు కె నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ పుస్కూర్‌ రామ్మోహన్‌ రావుతో పాటు శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *