టెస్టుల్లో ధావన్‌కు ఇక కష్టమే

 

శిఖర్‌ ధావన్‌ మళ్లీ టెస్టు ఆడే అవకాశం ఇప్పట్లో లేనట్లేనని మాజీ టెస్టు ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే జట్టు మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే టెస్టు ఓపెనర్‌గా పువురు ఆటగాళ్లను పరిక్షించింది. ధావన్‌ విఫమైన తర్వాత రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా తమను తాము నిరూపించుకున్నారు. గిల్‌ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. శిఖర్‌ ధావన్‌కు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం రాకపోవచ్చు.. ఒకవేళ వచ్చినా అది ఇప్పట్లో జరుగదు’ అని ఆకాశ్‌ అన్నాడు. టెస్టుల్లో ఇప్పటికే రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌ కూడా వీరికి ప్రత్యామ్నా యంగా బాగానే ఆడుతున్నారు. యువ యువ ఆటగాడు గిల్‌ కూడా భవిష్యత్తులో ఆడే అవకాశాు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్‌ లో ధావన్‌కు టెస్టుల్లో అవకాశం భించకపోవచ్చు’ అని ఆకాశ్‌ చెప్పుకొచ్చాడు. కెఎల్‌ రాహుల్‌, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారీ, మురళీ విజయ్‌ వరకు భారత క్రికెట్‌ జట్టు అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అనేక మంది ఆటగాళ్లను ప్రయత్నించింది. కానీ ధావన్‌ లాగా నికడగా ఎవరు రాణించలేదనే చెప్పుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *