ఫిట్‌నెస్‌తో రాణింపు

విరాట్‌ ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం రాజీపడని క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడు. అందుకే భారత క్రికెట్‌ జట్టులోనే కాదు ప్రపంచ క్రికెటర్లలో ఎవరిని తీసుకున్నా ఫిటినెస్‌లో మాత్రం విరాట్‌ కోహ్లీ తర్వాతే అని చెప్పక తప్పదు. ఈ ఏడాది ఐపీఎల్‌ దుబాయ్‌లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడి చేరుకున్న విరాట్‌ ఫిట్‌నెస్‌ కాపాడుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు. మీ చిక్కినపుడల్లా వ్యాయామం, ప్రాక్టీస్‌, ఆరోగ్య పరిరక్షణతోనే రాణించడం సాధ్యమవుతుందని పేర్కొంటూ.. విరాట్‌ కోహ్లీ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెట్డాడు. ఈ పోస్టులో నెట్‌ ప్రాక్టీస్‌, మిగిలిన సభ్యుతో ఫుట్‌బాల్‌ ఆడుతున్న ఫోటోతో పాటు చ్లటి నీటితో స్నానం (ఐస్‌ బాత్‌) ఫోటో ట్వీట్‌ చేశాడు. విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *