12 నుంచి 80 ప్రత్యేక రైళ్లు

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా కొన్ని నెలల నుంచి నిలిచి పోయిన ప్యాసింజర్‌ రైళ్ల కదలికు క్రమక్రమంగా మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. అన్‌లాక్‌ 4 లో భాగంగా మరో 100 ప్యాసింజర్‌ రైళ్లను నడిపేందుకు అనుమతి కోరుతూ హోం శాఖకు రైల్వే మంత్రిత్వ శాఖ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్లియరెన్స్‌ భించడంతో ఈ నె 12 నుంచి 80 రైళ్లు నడిపేందుకు మార్గం సుగమం అయింది. ఈ విషయమై రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ మాట్లాడుతూ.. 80 ప్రత్యేక రైళ్లు లేదా 40 జత రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రైళ్లలో ప్రయాణానికి అవసరమైన రిజర్వేషన్లను ఈ నె 10 తేదీ నుంచి చేసుకోవచ్చు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు ఈ 80 రైళ్లు అదనం’ అని పేర్కొన్నారు. కాగా పరీక్షుల ఇతర ముఖ్య అవసరా కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *