టీడీపీకి విశాఖ మాజీ ఎమ్మెల్యే ‘పల్లా’ గుడ్‌ బై ?

ఉత్తరాంధ్రలో టీడీపీకి మరో షాక్‌ తగబోతుందట. బమైన సామాజికి వర్గానికి చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, గాజువాకకు చెందిన పల్లా శ్రీనివాసరావు టీడీపీకి రాజీనామా చేయబోతున్నారని తెలిసింది. టీడీపీకే చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని చాలా కాంగా వినిపిస్తుంది. అయినా ఆయన ఏ విషయం త్చేలేదు. కాగా ఇప్పుడు విశాఖ, గాజువాకల్లో బమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు టీడీపీని వీడడం ఖాయమంటున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తిప్ప నాగిరెడ్డి చేతిలో ఓడిపోయిన పల్లా శ్రీనివాసరావు ఓటమి ముందు నుంచి ఖాయమనే పుకార్లు షికార్లు చేశాయి. అదే నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ కూడా బరిలో దిగడంతో ఆయనను గెలిపించడానికి చంద్రబాబు పల్లా శ్రీనివాసరావును పట్టించుకోలేదని ఆయన అనుచరునుకున్నారు. పల్లా పిలిచినా చంద్రబాబు గాజువాకలో ప్రచారం చేయలేదు. అప్పట్నుంచి పల్లా శ్రీనివాసరావు అక మీదున్నారనీ, ఇప్పుడు సమయం చూసి పార్టీ వీడుతున్నారని తెలిసింది. అయితే ఆయన వైసీపీ చేరుతారో, బీజేపీలో చేరుతారో మాత్రం తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *