హిందూ ఆలయాలoటే లెక్కలేదా.. జగన్‌ !

 

హిందూ ఆలయాలoటే లెక్కలేదా.. పురాణాలు తెలియదా..?, మీ పాలసీ ఏంటని సీఎం జగన్‌ను వై సీ పి ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. జగన్‌పై రఘురామ.. ఆయన సోమవారం ఢీల్లీిలో మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ ల క్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. ప్రమాదం కుట్ర అని ఎంపీ రఘురామకృష్ణరాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేది ఆల య ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారని సీఎం జగన్‌ను ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. అంతర్వేదిలో సీసీ కెమెరాలు పనిచేయలేదు అని.. ఎందుకు ఆ సమయానికి పనిచేయలేదు అని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలూ తీసుకోవాలని చెప్పడం తప్పా అని అడిగారు. కానీ సహచర మంత్రుల కు మాత్రం వారు ఎర్రివారిలాగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. రథం ప్రమాద ఘటనపై దేవాదాయ శాఖ అధికారుల ను విచారణ చేయమని చెప్పడం సరికాదని రఘురామ మండిపడ్డారు ఒక మతంపై దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానం ఏంటో స్పష్టం చేయాల ని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *