రక్షణ రంగంలో మరో అరుదైన ఘనత

 

మన దేశం రక్షణ రంగంలో మరో అరుదైన ఘనతను సాధించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థను , వైమానిక ప్లాట్‌ఫాంకు శక్తినిచ్చే దేశీయంగా అభివృద్ధి చేసిన హైపర్‌సోనిక్‌ టెక్నాల జీ డెమాన్‌స్ట్రేటర్‌ వెహికల్‌ (హెచ్‌ఎస్‌టీడీవీ)ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిస్సా తీరంలోని వీర్‌ ఐలాండ్‌లోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం లాంచ్‌ కాంప్లెక్స్‌ను నుంచి ఈ ప్రయోగాన్ని చేశారు. హెచ్‌ఎస్‌టీడీవీని విజయవంతంగా పరీక్షించడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్రమోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాకారం చేసే క్రమంలో ఈ మలురాయిని సాధించినందుకు డీఆర్‌డీవోను అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. హెచ్‌ఎస్‌టీడీవీ క్రూయిజ్‌ క్షిపణులను శక్తిమంతం చేయడంతోపాటు స్క్రామ్‌జెట్‌ ఇంజిన్లపైనా పనిచేస్తుంది. ఇది మాక్‌ 6 వేగాన్ని అందుకోగల దు. రామ్‌జెట్స్‌ కంటే అత్యుత్తమమైనదని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *