వ్యాక్సిన్‌ తీసుకున్న రష్యా రక్షణ మంత్రి

 

రష్యా రక్షణశాఖ మంత్రి సెర్జీ షోయగు కూడా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ప్రకటించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఈయన తెలిపారు. ‘నేను వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీర ఉష్ణోగ్రతల్లో ఎటువంటి మార్పు లేదు. అంతేకాకుండా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా లేవు. అందువ్ల ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాల ని సూచిస్తున్నా’ అని రక్షణ శాఖ మంత్రి పేర్కొన్న విషయాన్ని అక్కడి వార్తా సంస్థలు వెల్లడించింది. వ్యాక్సిన్‌ పై వస్తోన్న విమర్శల ను తిప్పికొట్టే వ్యూహంలోనే భాగంగా రక్షణ మంత్రి వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు సమాచారం. తద్వారా రష్యా తయారుచేసిన వ్యాక్సిన్‌ సురక్షితమైన, సమర్థవంతంగా పనిచేస్తుందనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *