చంద్రబాబు లోకేష్‌లా మాట్లాడితే ఎలా!.

చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత లోకేష్‌లా మాట్లాడితే ఎలా ! అని ప్రశ్నించారు టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చంద్రబాబు హయాంలో కరంట్‌ ఛార్జీలు పెంచారనీ, బషీర్‌ బాగ్‌కు కారణం అయ్యారని మండిపడ్డారు. అలా 2004లో టీడీపీ కరెంట్‌ ఛార్జీల వల్లనే మళ్ళీ గెవలేదని గుర్తు చేశారు. పాదయాత్రలో రైతుల బాధలు చూసి వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇచ్చారనీ, వైఎస్‌ మరణం తర్వాత ఉచిత కరంట్‌ పథకానికి తూట్లు పడిoదన్నారు.30 ఏళ్ళ పాటు రైతుల కు ఇబ్బంది ఉండకూడదని కేంద్ర సంస్కరణను జగన్‌ అందిపుచుకున్నారనీ, పెన్షన్లు, జీతాలు ఇచ్చినట్లే.. ఉచిత కరంట్‌ డబ్బు అకౌంట్‌లో పడతాయి’ అని వంశీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటల కు మతి భ్రమించిది అనుకునేలా ఉన్నాయి. చంద్రబాబు కొడుకేమో గేరు వెయ్యలేక పోతున్నారు. ఎక్సలేటర్‌ తొక్కలేకపోతున్నారు. చంద్రబాబు దగ్గర బిర్యానీ పొట్లాల కు ప్రెస్‌మీట్లు పెట్టే నాయకులు ఉన్నారు’ అని వంశీ విమర్శలు గుప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *