ప్రముఖ నటుడు జేపీ మృతి

 

తెలుగు సినీ పరిశ్రమ మరో విలక్షణ నటుడ్ని కోల్పోయింది. మంగళవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి (74) కన్నుమూశారు తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌పై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులో ఉన్న తన స్వగృహం లోనే ఉంటున్నారు. జయప్రకాష్‌ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండం సిరివ్లె. ఆయన సినిమాల్లోక రాకముందు స్కూల్‌ టీచర్‌గా ఉద్యోగం చేశారు. నాటక రంగం నుంచి రావడంతో ఏ పాత్రలో నటించినా తనదైనా శైలితో రక్తి కట్టించేవారు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించిన జయప్రకాష్‌ రెడ్డి కెరీర్‌కి టర్నింగ్‌ ఇచ్చిన సినిమా వెంకటేష్‌ హీరోగా నటించిన జయం మనదేరా. అప్పట్నుంచి ఆయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. కమెడియన్‌గా, విలన్‌గా వెండితెరపై తనదైన మార్క్‌ వేసుకున్న ఆయన.. చివరగా మహేష్‌ బాబు హీరోగా వచ్చిన ఃసరిలేరు నీకెవ్వరుః సినిమాలో కనిపించారు. కాగా జయప్రకాష్‌ రెడ్డి మృతి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిoచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *