బుజ్జిగాడు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ సంజనను సెంట్రల్‌క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.శాండల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఈ డ్రగ్స్‌ కేసులో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌(సీసీబీ) తాజాగా సినీ నటి సంజన గల్రానీని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ ‌ రాహుల్‌ను సీసీబీ పోలీసు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ మాఫియాతో రాహుల్‌కు సంబంధాలున్నట్లు తేల్చారు. రాహుల్‌ అరెస్ట్‌ అనంతరం.. సంజన కొందరు విమర్శకులకు ఘాటుగా సమాధానమిచ్చింది. డ్రగ్స్‌ మాఫియా, సినీ తారలపై గడచిన వారం రోజులుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరగిపై సంజన విరుచుకుపడిరది. సోమవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన సంజన.. ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌తో తనకు పరిచయం లేదని చెప్పింది. డ్రగ్స్‌తో సంబంధం లేకున్నా తన పేరును తెరపైకి తెచ్చారని చెప్పుకొచ్చింది. సెలబ్రెటీ అయినందునే తనను టార్గెట్‌ చేశారని, అయితే సంబరగి మాత్రం చీర్‌గర్ల్‌ అంటూ ఆరోపించారని ఉద్వేగానికి లోనైన సంజనా కంటతడి పెట్టుకుంది. రాహుల్‌ తనకు సోదరుడు లాంటి వాడని ఆ విషయంలో వెనుకడుగే లేదన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంట వ్యవధిలోనే సంజనా కూడా అరెస్ట్‌ కావడం గమనార్హం. తెెలుగులో యమహో యమ, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రాల్లో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *