యూఏఈకీ గంగూలీ పయనం

కరోనా కల్లోలo కారణంగా మన దేశం నుంచి తరలిపోయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ అంచె ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌కి సంబంధించిన పనులు పర్యవేక్షణకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ యూఏఈకి వెళ్లాడు. దాదాపు 6 నెలల కరోనా విరామం తర్వాత విదేశానికి పయనమైనట్లు ఇన్‌స్టాగ్రాం లో ఒక పోస్టు పెట్టాడు. 6 నెలల కాలంలో తొలిసారి విమాన ప్రయాణం చేస్తున్నా.. జీవనశైలి పూర్తిగా మారిపోయింది.. ఇంతకముందలా మాత్రం లేదు.. ఫేసుకు మాస్కుతో పాటు ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకొని విమానం ఎక్కాను. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోనే మీతో షేర్‌ చేసుకుంటున్నా’ అంటూ తెలిపాడు. సెప్టెంబర్‌ 19న చెన్నై, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదవుతున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ నవంబర్‌ 10 వరకు 53 రోజుల పాటు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *