భోజనంలో వెంట్రుకలు , గోళ్లు

 

పటియాల నేషనల్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐ ఎస్‌)లో తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆసియాలోనే అతిపెద్ద క్రీడా శిక్షణ కేంద్రాల్లో ఒకటైన పటియా నేషనల్‌ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఐ ఎస్‌) అథ్లెట్లకు సరైన భోజనం అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమ దాస్‌తో పాటు ఇతర అథ్లెట్లు తమకు ఎన్‌ఐఎస్‌లో మంచి ఆహారం పెట్టడం లేదని అక్కడి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్‌ఐఎస్‌ వంటగది ఆవరణ అపరిశుభ్రంగా ఉందని.. కొవిడ్‌-19 నిబంధనలు కూడా పాటించడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్‌ఐఎస్‌ పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందంట. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కిరణ్‌ రిజుజు వెంటనే భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) అధికారులను మందలించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *